
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ మరియు మోషన్ పోస్టర్ లకు మంచి స్పందన లభించింది.
ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన కుంభకోణాల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్టు గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక మరోవైపు ఈ చిత్రంలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా ఎంపిక అయినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఒకానొక సందర్భంలో కీర్తి కూడా అభిమానులతో ఛాట్ చేస్తూ ఈ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తావించింది. దీంతో అందరూ ఆమెనే హీరోయిన్ అని ఫిక్స్ అయ్యారు.
అయితే ఇలాంటి వరుణంలో కీర్తిని మహేష్ టీమ్ వద్దనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇటీవల విడుదలైన రంగ్‌దే టీజర్లో ఆమె లుక్ పెద్దగా ఆకట్టుకునేలా లేదని కామెంట్లు వినిపించాయి. ఈ క్రమంలోనే ఆమె ప్లైస్లో మరొక హీరోయిన్ను తీసుకోవాలని దర్శక, నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరి ఇది వరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.