రికార్డు స్థాయిలో `స‌ర్కారు వాటి పాట` శాటిలైట్ & డిజిటల్ రైట్స్!

September 14, 2020 at 12:27 pm

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం పరశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 14 రీల్స్, మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్ థ‌మ‌న్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హాన‌టి చిత్రంతో మంచి పేరు సంపాదించుకున్న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

ఇక ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావాల్సి ఉండ‌గా.. క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల అడ్డంకులు ఏర్ప‌డుతున్నాయి. అయితే 2021లో వేస‌వి కానుక‌గా ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే అక్టోబ‌ర్ లో స‌ర్కారు వారి పాట షూటింగ్ ను షురూ చేసేందుకు చిత్ర‌టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. స‌ర్కారు వాటి పాట తెలుగు శాటిలైట్ & డిజిటల్ రైట్స్ రూ. 35 కోట్లకు అమ్ముడుపోయిన‌ట్టు తెలుస్తోంది.

ఇక హిందీ శాటిలైట్ హక్కులతో పాటు ఇతర హక్కులు త్వరలోనే క్లోజ్ అవ్వ‌నున్న‌ట్టు స‌మాచారం. కాగా, ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ చేసిన సూప‌ర్ స్టార్ లుక్స్ కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇదే స‌మ‌యంలో ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. మ‌రి ఈ చిత్రం ఎంత వ‌ర‌కు అంచ‌నాలు అందుకుంటుందో చూడాలి.

రికార్డు స్థాయిలో `స‌ర్కారు వాటి పాట` శాటిలైట్ & డిజిటల్ రైట్స్!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts