సత్యమేవ జయతే-2 వచ్చేస్తుంది.. డేట్ ఫిక్స్..!

September 22, 2020 at 11:09 am

తన జీవితంలోని జయపజయాలను, స్నేహితులతో జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు హీరో జాన్​ అబ్రహాం. ముంబయిలో ఓ ప్రైవేట్​ ఛానల్​లో జరిగిన చాట్ షోలో తన జీవిత అనుభవాల్ని పంచుకున్నాడు.నేను మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చినా.. అప్పటి విలువలను బలంగా నమ్ముతాను. నా జీవితంలో ఇప్పటి వరకూ ఎన్నో విజయాలను, అపజయాలను చూశాను. అందుకే ఓటమితో ఎప్పుడూ ప్రభావితం చెందను అని జాన్​ అబ్రహాం అన్నారు.

సత్యమేవజయతే’ చిత్రం జాన్​ అబ్రహాంకు ఎంతో గుర్తింపు తెచ్చింది. దీనికి సీక్వెల్​గా దర్శకుడు మిలాప్​ జవేరీ తెరకెక్కిస్తున్న ‘సత్యమేవ జయతే-2’ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.అందులో జాన్​అబ్రహాం నాగలి పట్టుకొని ఉండగా.. అతని శరీరంపైన ఉన్న గాయాల నుంచి త్రివర్ణంలో రుధిరం కారుతున్నట్లు ఉన్న లుక్​ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రాన్ని 2021 మే 12న రంజాన్​ కానుకగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది చిత్రబృందం.ఏ దేశంలో గంగ ప్రవహిస్తుందో అక్కడ.. రక్తం కూడా త్రివర్ణంలో ఉంటుంది” అనే స్లోగన్​ను పోస్టర్​పై క్యాప్షన్​గా​ పెట్టారు.

సత్యమేవ జయతే-2 వచ్చేస్తుంది.. డేట్ ఫిక్స్..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts