ఏపీలో రేప‌టి నుంచి స్కూళ్లు ప్రారంభం.. ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోండి?

September 20, 2020 at 8:14 am

కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని రంగాలు కుదేల్ అయ్యాయి. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అన్ని వ్యాపారాలు తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. మ‌రోవైపు స్కూళ్లు, కాలేజీలు మూత‌ప‌డ్డాయి. అయితే అన్‌లాక్‌4 లో భాగంగా కరోనా పరిస్థితుల మధ్య దేశంలో స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. ఈ క్ర‌మంలోనే రేప‌టి (సెప్టెంబ‌ర్ 21) నుంచి కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ విద్యా సంస్థలు తెరవడానికి ఏపీ స‌ర్కార్ స‌ర్వం సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా.. కంటెయిన్‌మెంట్‌ జోన్లకు వెలుపల ఉన్న ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు విద్యా సంస్థలను మాత్రమే తెరవనున్నారు. అలాగే విద్యార్థుల్లో 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మాత్రమే స్కూళ్లకు అనుమతి ఉంది. అదే స‌మ‌యంలో సోమవారం నుంచి స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు తమ తల్లిదండ్రుల నుంచి సమ్మతి పత్రాన్ని స్కూళ్లలో సమర్పించాలి. పాఠ‌శాల‌లో విద్యార్థుల మధ్య ఆరు అడుగుల దూరం పాటించాలి.

బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, వాటర్ బాటిళ్లు, ఇత‌రిత‌ర వ‌స్తువులు పరస్పరం మార్చుకోకుండా ప్రత్యేక జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. శానిటైజర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి. స్కూళ్లలో ప్రవేశ ద్వారం దగ్గర తప్పనిసరిగా థర్మల్ స్కానర్లు, బాడీ టెంపరేచర్ చెక్ చేసేలా అన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ఇక ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాఠశాలకు అనుమ‌తిలేదు. వీరికి ఆన్‌లైన్‌, వీడియో పాఠాలే కొనసాగుతాయి.

ఏపీలో రేప‌టి నుంచి స్కూళ్లు ప్రారంభం.. ఇవి ఖ‌చ్చితంగా తెలుసుకోండి?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts