గుండు లుక్ కోసం చిరు కష్టాలు చూడండి…( వీడియో వైరల్ )

September 15, 2020 at 11:33 am

టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి గురువారం గుండు లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చి.. అంద‌రినీ షాక్‌కు గురిచేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పటి వరకు చిరంజీవిని గుండు చేయించుకున్న స్టిల్స్ లో ఎవరూ చూసి ఉండరు. అయితే చిరంజీవి గుండు లుక్ వెనుక సీక్రెట్ ఏంటి? ఉన్నట్టుండి సడెన్‌గా ఇలా ఎందుకు మారారనే విషయమై జనాల్లో చర్చలు మొదలయ్యాయి.

‘ఆచార్య’ తర్వాత చిరంజీవి చేయబోయే సినిమాల్లో రెండు రీమేక్‌లు ఉన్నాయి. అందులో ఒకటి మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్’ కాగా, రెండోది తమిళంలో బంపర్ హిట్ అయిన `వేదాళం`‌. ఇక‌ వేదాళం సినిమా కోస‌మే చిరు గుండు చేయించుకున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. చిరంజీవిది రియ‌ల్ గుండు కాద‌ని తేలింది. ఈ విష‌యాన్ని చిరునే రివిల్ చేశాడు.

`నా కొత్త లుక్‌ను అందరూ నిజమని నమ్మేలా చేసిన ఇండస్ట్రీలోని టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. మేజిక్‌ ఆఫ్‌ సినిమాకు సెల్యూట్‌` అని చిరు వీడియోతో పాటు మెసేజ్‌ కూడా షేర్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఏదేమైనా చిరంజీవి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇది మేకప్ టెస్ట్ అని చెప్పేంత వరకు అందరు చిరంజీవిది నిజం గుండే అనుకున్నారు.

 

గుండు లుక్ కోసం చిరు కష్టాలు చూడండి…( వీడియో వైరల్ )
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts