త‌మ్ముడి కోరిక‌ను తీర్చాలంటూ భార్య‌కు భ‌ర్త వేధింపులు

September 28, 2020 at 9:57 am

వ‌దిన అంటే త‌ల్లితో స‌మానం అంటారు. కానీ ఓ కామాంధుడు సామాజిక విలువ‌ల‌ను మ‌ర‌చిపోయి వ‌దిన‌నే లైంగిక వేధింపుల‌ను గురిచేయ‌డం మొద‌లుపెట్టాడు. కాపాడ‌తాడ‌ని విష‌యాన్ని భ‌ర్త‌కు చెబితే అక్క‌డా నిరాశే ఎదుర‌యింది. అదీగాక త‌మ్ముడి కోరిక‌ను తీర్చాలంటూ స‌ద‌రు భ‌ర్త‌నే ఆమెపై ఒత్తిడి పెంచ‌డం మ‌రో దారుణం. ఈ సంఘ‌ట‌న హ‌ర్యానా రాష్ట్రం క‌ర్నాల్‌లో వెలుగుచూసింది. పోలీసులు, బాధితురాలు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం…

హర్యానాలోని కర్నాల్ కు చెందిన ఓ యువ‌తికి నాలుగు నెల‌ల క్రితం వివాహ‌మైంది. కోటి ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టింది. పెళ్లైన మొదటి వారమే ఆమెకు ఓ షాక్ తగిలింది. తన లైంగిక కోరికలు తీర్చ‌లాంటూ మ‌ర‌ది వేధింపులు మొద‌లు పెట్టాడు. దీంతో భయాందోళ‌న‌కు గురైన ఆ యువ‌తి భర్తకు ఈ విషయాన్ని చెప్పగా అతడు లైట్ తీసుకున్నాడు. అక్క‌డితో ఆగ‌కుండా తమ్ముడు కోరిక తీర్చ‌మ‌ని ఆదేశించ‌డంతో ఆ యువ‌తి నిర్ఘాంత పోయింది. నాటి నుంచి అన్నదమ్ములు ఇద్దరూ కలిసి యువతిని లైంగిక వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టేశారు. మ‌రోవైపు అత్త‌మామ‌లు కూడా అదనపు కట్నం కోసం వేధింపులు షురూ చేశారు. ఇక ఆ వేధింపుల‌ను భ‌రించ‌లేక ఆ యువ‌తి పోలీసులను ఆశ్ర‌యించింది. అత్త, మామ, భర్త, మరిది వేధింపులపై ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేర‌కు పోలీసులు వాళ్లపై కేసు నమోదు చేసి విచార‌ణ చేప‌ట్టారు.

త‌మ్ముడి కోరిక‌ను తీర్చాలంటూ భార్య‌కు భ‌ర్త వేధింపులు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts