శర్వా ‘శ్రీకారం’… ఓటిటి సహకారంతోనేనా..?

September 21, 2020 at 6:52 pm

ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ వైవిధ్యమైన కథాంశంతో కిషోర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న శర్వా 29 వ చిత్రం శ్రీకారం. పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో… శర్వానంద్ పూర్తిస్థాయి పల్లెటూరు కుర్రాడి పాత్ర లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకునే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ ఊహించని విధంగా కరోనా వైరస్ ప్రభావం రావడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

అయితే ఇక రానున్న రోజుల్లో శర్వానంద్ స్వీకారం సినిమాని ఓటిటి లో విడుదల చేయక తప్పదా అంటే అవును అనే టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇటీవలే నాని సుధీర్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమా ఓటీటీ వేదికగా విడుదలైన నేపథ్యంలో మరికొంత మంది స్టార్ హీరోలు కూడా ఓటిటి వేదికగా తమ సినిమాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే శ్రీకారం చిత్రబృందం కూడా సినిమాను ఓటిటి వేదికగా విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది అని టాలీవుడ్ టౌన్ లో టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

శర్వా ‘శ్రీకారం’… ఓటిటి సహకారంతోనేనా..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts