`ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటోన్న శర్వానంద్‌?

September 30, 2020 at 1:20 pm

టాలీవుడ్ యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టించిన చిత్రం `శ్రీకారం`. ఈ సినిమా షూటింగ్ చివరిదశకు కూడా చేరుకుంది. నూతన దర్శకుడు కిశోర్ రెడ్డి దర్శకత్వంలో 14 రీల్స్ ప్లస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రం వాస్తవానికి మొన్న వేసవిలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా వైర‌స్ వల్ల ఆగిపోయింది. ఈ చిత్రం త‌ర్వాత అజయ్ భూపతి ద‌ర్శ‌క‌త్వంలో `మహా సముద్రం` సినిమాలో న‌టించ‌నున్నాడు శర్వానంద్‌.

తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వాతో పాటు మరో హీరో సిద్ధార్ధ్ కూడా నటించనున్నాడు. ఇక తాజాగా మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు శ‌ర్వానంద్‌. 2017లో టాలెంటెడ్ దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ దగ్గుబాటి హీరోగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు. కానీ ఎందుకో ఈ చిత్రం సెట్స్ పైకి వెల్ల‌లేదు.

ఆ సమయంలో రామ్ తో ఉన్నది ఒక్కటే జిందగీ సినిమా తీశాడు కిశోర్.. ఆ త‌ర్వాత సాయి తేజ్ తో చిత్రలహరి తీసి హిట్ అందుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న రామ్ తో `రెడ్` చిత్రాన్ని తెర‌కెక్కించాడు. అయితే ఇప్పుడు కిశోర్ తిరుమల తన పాత ప్రాజెక్ట్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మళ్లీ ట్రాక్ లోకి తెచ్చినట్లు తెలుస్తోంది. అదే కథను స్వల్ప మార్పులు చేసి శర్వానంద్ కు వినిపించ‌గా.. ఆయ‌న ఒకే చెప్పార‌ట‌. దీంతో మేకర్స్ అదే టైటిల్‌ను లాక్ చేశారట. సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప‌ట్టాలెక్క‌నుంది.

`ఆడవాళ్లు మీకు జోహార్లు` అంటోన్న శర్వానంద్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts