త్వరలో తెరుచుకోనున్న శిల్పారామం..!

September 26, 2020 at 7:28 pm
Shilparamama

తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఈ మహమ్మారి కారణంగా పర్యాటక ప్రదేశాలు అన్ని మూతపడ్డాయి. ఇక లాక్ డౌన్ సడలింపులో భాగంగా మూసివేయ‌బ‌డ్డ శిల్పారామం(మాదాపూర్‌) అక్టోబ‌ర్ 2వ తేదీన తెరుచుకోనుందని అధికారులు తెలిపారు. ఇక మ‌ధ్యాహ్నం 2 గంట‌ల నుంచి రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు శిల్పారామం తెరిచి ఉండ‌నుందని అన్నారు. ప‌ర్యాట‌కుల‌కు థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ చేసిన త‌ర్వాతే లోప‌లికి అనుమ‌తించ‌నున్నారు. ప్ర‌వేశ ద్వారం వ‌ద్ద ప‌ర్యాట‌కులు క‌చ్చితంగా చేతుల‌ను శానిటైజ్ చేసుకోవాలని తెలిపారు.

ఇక కేంద్ర మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు శ‌నివారం నుంచి అర్బ‌న్ పార్కుల‌ను తెరిచేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తిచ్చిన విష‌యం విదిత‌మే. క‌రోనా నిబంధ‌న‌ల‌ను అనుస‌రించి సంద‌ర్శ‌కుల‌కు శానిటైజ‌ర్ల‌ను అందుబాటులో ఉంచాలని తెలిపారు. మాస్కులు ధ‌రించిన వారినే లోప‌ల‌కు అనుమ‌తించాల‌ని అధికారుల‌ను ప్ర‌భుత్వం ఆదేశించిందన్నారు. వ‌చ్చే నెల 6వ తేదీ నుంచి హైద‌రాబాద్‌లోని నెహ్రూ జూలాజిక‌ల్ పార్కు సంద‌ర్శ‌కుల‌కు అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.

త్వరలో తెరుచుకోనున్న శిల్పారామం..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts