రేవ్ పార్టీలకు అడ్డాగా సుశాంత్ ఫామ్ హౌస్.. శ్రద్ధాకపూర్‌కు లింకులు?

September 17, 2020 at 7:50 am

బాలీవుడ్ యువ కెర‌టం సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతి కేసులో డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగి లోతుగా విచార‌ణ జ‌ర‌ప‌డంతో.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలోనే సుశాంత్ రాజపుత్ కు లోనవాలా లో ఉన్న ఫామ్ హౌస్ రేవ్ పార్టీలకు అడ్డా అని తేలింది.

ఇప్ప‌టికే ఫామ్‌ హౌస్‌లో హుక్కా, డ్రగ్స్‌ వాడిన ఆనవాళు కనిపించినట్టుగా కూడా అధికారులు తెలిపారు. మ‌రోవైపు ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న రియా విచారణలో మరిన్ని విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. సుశాంత్ త‌న ఫామ్ హౌస్‌లో నిర్వహించే డ్రగ్ పార్టీలకు బాలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు వ‌స్తార‌ని ఆమె చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అంతేకాదు, సుశాంత్ తో కలిసి చిచోరే సినిమాలో న‌టించిన‌ బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ కూడా ఫామ్ హౌస్ లో నిర్వహించే రేవ్ పార్టీలకు హాజ‌ర‌వుతుంద‌ని రియా చెప్పిన‌ట్టు క‌థ‌నాలు వ‌స్తున్నాయి. మరి శ్రద్ధాకపూర్‌కు, సుశాంత్ ఫామ్ హౌస్‌లో జ‌రిగే రేవ్ పార్టీల‌కు నిజంగా లింకులు ఉన్నాయా.. లేదా.. అన్న‌ది ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు స‌మాచారం.

రేవ్ పార్టీలకు అడ్డాగా సుశాంత్ ఫామ్ హౌస్.. శ్రద్ధాకపూర్‌కు లింకులు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts