ఐపీఎల్ 2020: ఓడిన ఢిల్లీకి మరో షాక్.. రూ. 12 లక్షల జరిమానా!

September 30, 2020 at 9:27 am

ఢిల్లీ క్యాపిటల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌‌ మధ్య జరిగిన‌ మ్యాచ్‌లో ఎట్టికేలకు ఎస్‌ఆర్‌హెచ్ తొలి విజ‌యం సాధించింది. 15 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌‌పై విజయం సాధించింది. రైట్ ఆర్మ్ లెగ్‌బ్రేక్ స్పిన్నర్ రషీద్‌ఖాన్ దెబ్బకు 163 పరుగుల ఓ మాదిరి లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఢిల్లీ పరాజయం పాలైంది.

ఫలితంగా ఐపీఎల్‌లో హైదరాబాద్‌కు తొలి విజయం దక్కింది. అయితే ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ కు మ‌రో షాక్ త‌గిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌కు ఐపీఎల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. కనీస ఓవర్ రేట్ తప్పిదం కారణంగా ఐపీఎల్ నియమావళి కింద అయ్యర్‌కు జరిమానా విధించినట్టు పేర్కొంది.

ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.5 ప్రకారం.. ఫీల్డింగ్ జట్టు స్లోఓవర్ రేట్ మెయిన్‌టేన్ చేయకపోతే ఈ జరిమానా విధిస్తారు. ఈ సీజన్‌లో జరిమానా విధించడం ఇది రెండోసారి. ఇంతకుముందు బెంగళూరు కెప్టెన్ కొహ్లీకి రూ.12 లక్షల జరిమానా ప‌డిన సంగ‌తి తెలిసిందే.

ఐపీఎల్ 2020: ఓడిన ఢిల్లీకి మరో షాక్.. రూ. 12 లక్షల జరిమానా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts