శృతిమించిన పాక్ తెగింపు.. 17 ఏళ్లలో ఇదే మొదటిసారి..?

September 15, 2020 at 3:30 pm

సరిహద్దుల్లో పాకిస్తాన్ నీచ బుద్ధి రోజురోజుకు బయటపడుతున్న విషయం తెలిసిందే. భారతదేశంపై ఉగ్రవాదులను ఉసిగొల్పడం… సరిహద్దుల్లో సైనికులపై పాక్ సైన్యం దాడులకు పాల్పడడం లాంటివి చేస్తూనే ఉంది పాకిస్తాన్. అయితే పాకిస్తాన్ తీరు రోజురోజుకు శృతి మించి పోతుంది అన్నది ఇటీవలే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ వేదికగా వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం పాకిస్థాన్ మరింత బరితెగించింది.

గతంలో కేవలం అతి తక్కువ సార్లు మాత్రమే ఇరు దేశాల మధ్య ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి దాడులకు పాల్పడింది … కానీ ఈ ఏడాది మాత్రం గత 17 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ పై దాడికి దిగింది. ఏకంగా 3186 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్తాన్. ఎన్నో రకాలుగా సరిహద్దుల్లో భారత సైన్యంపై దాడులకు దిగింది. ఇటీవలే ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా తెలిపిన కేంద్ర ప్రభుత్వం… పాకిస్తాన్ ఎన్ని దాడులు చేసినప్పటికీ భారత సైన్యం ఎంతో సమర్థవంతంగా వారిని తిప్పికొట్టింది అంటూ చెప్పుకొచ్చింది.

శృతిమించిన పాక్ తెగింపు.. 17 ఏళ్లలో ఇదే మొదటిసారి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts