దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం: ఈవో మంత్రి కులమే

September 16, 2020 at 11:18 am

ఇటీవలే అంతర్వేది రథం ఘటనపై ఏపీలోని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన మీద రాజకీయం నడుస్తుండగానే, విజయవాడ కనకదుర్గ గుడిలో వెండి సింహాలు మాయమైపోయాయి. దీనిపై ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నాయి. అంతర్వేది రథం దగ్ధం ఘటనలో ఈవోను వెంటనే సస్పెండ్ చేశారని.. మరి దుర్గగుడిలో వెండి రథంలో మూడు సింహాల మాయం విషయంలో ఈవోపై  మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని జనసేన నాయకుడు మహేష్ ప్రశ్నించారు.

ఈవో సురేష్ బాబు తన సామాజిక వర్గం అనా.. లేక కోటి రూపాయలు తీసుకొని పోస్టింగ్ ఇచ్చారనా? అని మహేష్ ఫైర్ అయ్యారు. తప్పు జరిగినా  చర్యలు లేవంటే… మంత్రి తీరుపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. మూడు సింహాల మాయంపై ఈవో సురేష్ బాబు స్పందించారు. సింహాలు మాయం కాలేదని.. రికార్డులు పరిశీలిస్తామని, అంతర్వేది ఘటన జరిగింది కాబట్టి ఇలాంటి ఫేక్ న్యూస్‌లు వస్తున్నాయని చెప్పారు. రికార్డుల పరిశీలన కోసం మూడు రోజుల సమయం కావాలని ఈవో తెలిపారు.

దుర్గ గుడిలో వెండి సింహాలు మాయం: ఈవో మంత్రి కులమే
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts