కేటీఆర్ ఇలాకాలో సెక్స్ రాకెట్‌..

September 30, 2020 at 12:21 pm

వ్య‌భిచార దందా రోజురోజుకూ విస్త‌రిస్తున్న‌ది. సుల‌భంగా డ‌బ్బు సంపాదించాల‌నుకునే మ‌హిళ‌లు పెడ‌దారి ప‌డుతున్నారు. వేశ్య‌వృత్తిలోకి మ‌ళ్లుతున్నారు. గ‌తంలో పెద్ద పెద్ద ప‌ట్ణ‌ణాలు, కొంత మంది మాత్ర‌మే ఈ వ్య‌భిచార దందాను కొన‌సాగించేవారు. ఇప్పుడు ప‌రిస్థితి పూర్తిగా మారిపోతున్న‌ది. చిన్న చిన్న ప‌ట్ట‌ణాల‌కు కూడా ఈ దందా విస్త‌రిస్తున్న‌ది. ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్ ఇలాకాలో గుట్టుగా సాగుతున్న వ్య‌భిచార దందాను పోలీసులు బ‌ట్ట‌బ‌య‌లు చేయ‌డం అందుకు నిద‌ర్శ‌నం. పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్ ప్రాంతంలో ఓ మ‌హిళా ఇల్లును అద్దెకు తీసుకున్న‌ది. ఎవ‌రికీ తెలియ‌కుండా గుట్టుగా కొంతకాలంగా వ్యభిచారం దందాను కొన‌సాగిస్తున్న‌ది. ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ప‌క్కా ప‌థ‌కం ప్ర‌కారం మంగళవారం సాయంత్రం ఆ ఇంటిపై దాడి చేశారు. నిర్వాహకులతో పాటు యువతలు, విటుల‌ను రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వారిని సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన‌ట్లు టాస్క్‌ఫోర్స్‌ సీఐ రవికుమార్ వెల్ల‌డించారు. అరెస్టైన వారిలో సిరిసిల్లకు చెందిన ఇద్దరు నిర్వాహకులు, హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన మహిళ, వేములవాడకు చెందిన విటుడు ఉన్నాడు. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

కేటీఆర్ ఇలాకాలో సెక్స్ రాకెట్‌..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts