17 ఏళ్ల కుర్రాడిపై పగబట్టిన పాము.. వెంటాడి వెంటాడి కాటేస్తున్న వైనం!

September 2, 2020 at 9:54 am

నిజంగా పాములు ప‌గ‌ప‌డ‌తాయా అంటే.. కొందరు అవునంటే కొందరు కాదంటారు. దీంతో ఇది ఎప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే ఉండిపోయింది. అయితే ఉత్తరప్రదేశ్ లో జ‌రిగిన ఓ ఘ‌ట‌న అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేస్తుంది. ఓ కుర్రాడిని ఓ పాము ఒకే నెలలో ఏకంగా ఎనిమిది సార్లు కాటేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని బస్తి జిల్లా రాంపూర్ గ్రామంలో 17 ఏళ్ల యశ్ రాజ్ మిశ్రా అనే కుర్రాడు ఉన్నాడు.

అయితే ఇత‌డిని పాము గండం పట్టుకుంది. ప్రతీ క్షణం పాము భయం వెంటాడుతోంది. ఎందుకంటే ఏదో ఒకసారి పాము కరిచిందంటే అది విధివశాత్తు జరిగిందనుకోవచ్చు. కానీ ఒకే పాము పదే పదే అతడ్నే కాటేస్తుంది. ఇలా ఒకే నెలలో 8 సార్లు అతన్నే కాటేసిందంటే… పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పామును ఎలాగైనా వదిలించుకోవాలని.. బంధువుల గ్రామమైన బహదూర్ పూర్ వెళ్లినా, పాము అక్క‌డ‌కు కూడా వ‌చ్చి కాటేసింది.

యశ్ రాజ్ ను ఆగస్ట్ 25న 8వ సారి కాటేసింది. ఆ పాము యశ్ రాజ్ పై పగబట్టిందని గ్రామస్తులు అంటుండడంతో.. స‌ద‌రు కుర్రాడు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నాడు. ప‌గ‌బ‌ట్టిన‌ట్టు వెంటాడి వెంటాడి కాటేస్తుండ‌డంతో కుటుంబ‌స‌భ్యులు కూడా క‌ల‌వ‌రపడుతున్నారు. ఇక చివ‌ర‌కు పాములు పట్టుకునేవాళ్లను పురమాయించినా ఫలితం లేకపోయింద‌ట‌. దీనిపై య‌శ్ రాజ్ మాట్లాడుతూ.. కనీసం తానెప్పుడూ ఓ పాముకు కూడా హాని చెయ్యలేదని, మరి ఈ పాము తనను ఎందుకు వెంటాడుతుందో అర్థంకావ‌డం లేద‌ని వాపోతున్నాడు.

17 ఏళ్ల కుర్రాడిపై పగబట్టిన పాము.. వెంటాడి వెంటాడి కాటేస్తున్న వైనం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts