సోదరుడే కీచకుడయ్యాడు.. చివరికి..?

September 27, 2020 at 2:36 pm

ఆడపిల్లలపై అత్యాచారం ఘటనలు రోజురోజుకు తెరమీదికి వస్తున్నాయి. అయితే మొన్నటి వరకు కేవలం బయటి వారి నుంచి మాత్రం మహిళలకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి కానీ ప్రస్తుతం రక్తం పంచుకుని పుట్టిన వారు సైతం లైంగిక వేధింపులకు పాల్పడుతుండడంతో మహిళల జీవితం ప్రశ్నార్థకంగా మారిపోతోంది. రోజు రోజుకు తెర మీదకి వస్తున్న ఘటనలు సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయి.

ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది. నమ్మిన వారే బాలికను వంచించారు. సొంత వారు అనుకున్న వారే దారుణంగా ప్రవర్తించారు. డ్రగ్స్ కి బానిసగా మారిన అన్న అతడి స్నేహితుడు ఇంట్లో అద్దెకుంటున్న 51 ఏళ్ల వృద్ధుడు ముగ్గురు వేర్వేరుగా 15 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. చతిస్గడ్ లో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పొత్తి కడుపులో నొప్పి రావడంతో ఆసుపత్రికి వెళ్లగా ఎనిమిది నెలల గర్భవతి అన్న విషయం బయటపడింది దీంతో ఒక్కసారిగా షాకైన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

సోదరుడే కీచకుడయ్యాడు.. చివరికి..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts