సోనూసూద్ మీరు అర్హులే.. ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్..?

September 30, 2020 at 3:57 pm

కరోనా వైరస్ కష్టకాలంలో ఆపదలో ఉన్న వారందరికీ ఆపద్బాంధవుడిగా మారి ఎంతో మంది హృదయాల్లో దేవుడిగా స్థానం సంపాదించుకున్నాడు సినీనటుడు సోనూ సూద్. సాయం అడిగిన ప్రతి ఒక్కరికీ సహాయం చేస్తూ ముందుకు సాగారు. ఇప్పటికీ ఎంతో మందికి సహాయం చేస్తూనే ఉన్నారు. ఇక సోనూసూద్ చేసిన సేవలకు మెచ్చిన ఐక్యరాజ్యసమితి… గొప్ప మానవతావాదిగా గుర్తిస్తూ సత్కారం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పటి వరకూ ఇలాంటి అవార్డులు ఎంతోమంది హాలీవుడ్ స్టార్స్ పొందారు. ఇక సోనూసూద్ కంటే ముందు మానవతావాది అవార్డు అందుకున్నారు బాలీవుడ్ నటి గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా. అయితే తాజాగా సోనూసూద్ కి ఈ సత్కారం లభించడంపై స్పందించిన ఆమె గుర్తించారు. సోనూసూద్ మీరు ఈ అవార్డుకు అర్హులే అని వ్యాఖ్యానించిన ప్రియాంక చోప్రా… మీ సేవలు మునుముందు కూడా ఇలాగే కొనసాగాలి అంటూ ఆశిస్తున్నాను అంటూ తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రియాంక చోప్రా.

సోనూసూద్ మీరు అర్హులే.. ప్రియాంక చోప్రా ఆసక్తికర కామెంట్..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts