నేడు చెన్నై ఫామ్ హౌజ్‌లో బాలు అంతిమ యాత్ర‌!

September 26, 2020 at 7:40 am

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం అందరినీ శోకసంద్రంలో ముంచుతూ తిరిగిరాని లోకాల‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. మెదడులో రక్తస్రావం జరగడంతో శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఇక ఆసుపత్రి నుంచి బాలు మృతదేహాన్ని చెన్నై కోడంబాక్కంలో ఉన్న ఆయన స్వగృహానికి అభిమానుల సందర్శనార్థం తరలించిగా.. ఆయన చివరి చూపు కోసం వేలాది మంది అక్కడకు తరలి వచ్చారు.

ఇక యావత్ భారత సినీ జగత్తును, అభిమానులను విషాద సాగరంలోకి నెట్టి.. ఇక సెలవంటూ మరో లోకానికి తరలి వెళ్లిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు నేడు చెన్నైలోనే జరగనున్నాయి. సెప్టెంబర్ 26 ఉదయం 11 గంటలకు బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

చెన్నైలోని రెడ్ హిల్స్‌లోని తన సొంత ఫామ్ హౌజ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన భౌతిక కాయాన్ని ఫామ్ హౌజ్‌కు తరలించారు. సెప్టెంబర్ 26 ఉదయాన్నే బాలు అంతిమయాత్ర మొదలు కానుంది. ఈ క్ర‌మంలోనే ఆయన చివరి చూపు కోసం వేలాది మంది తరలి వస్తున్నారు. ఇప్ప‌టికే బాల సుబ్రహ్మణ్యం అంత్య క్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

నేడు చెన్నై ఫామ్ హౌజ్‌లో బాలు అంతిమ యాత్ర‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts