ప్ర‌ధాని గారు.. బాలుకు భార‌త‌ర‌త్న ఇవ్వండి

September 30, 2020 at 6:50 pm

గాన గంధ‌ర్వుడు ఎస్పీ బాల‌సుబ్ర‌హ్మ‌‌ణ్యంకు భార‌త ర‌త్నా ఇవ్వాల‌నే డిమాండ్ జోరందుకుంటున్న‌ది. వేల పాట‌ల‌తో సినీ అభిమానుల‌నే కాకుండా యావ‌త్ భార‌తాన్ని ఓల‌లాడించిన ఆయ‌న‌కు దేశ అత్యున్న‌త పుర‌స్కారం అందించి స‌ముచిత స్థానం క‌ల్పించాల‌ని కోరే వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. ఇప్ప‌టికే ఇదే విష‌య‌మై ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి స్వ‌యంగా ఒక లేఖ‌ను కూడా రాయ‌డం గ‌మ‌నార్హం. బాలుకు భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాల‌ని కోరారు. అదేవిధంగా అనేక మంది సినీ అభిమానులు సైతం అదే ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా.. తాజాగా యువ హీరో మంచు మ‌నోజ్ త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌ధాని మోడీకి ఇదే విష‌య‌మై విజ్ఞ‌ప్తి చేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీగారు 40వేల‌కు పైగా పాట‌ల‌ను పాడి న బాలుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని మిమ్ముల విన‌య‌పూర్వ‌కంగా వేడుకుంటున్న అంటూ పోస్టు చేశారు. దానితో పాటు బాలు ఫొటోను కూడా మంచు మ‌నోజ్ షేర్ చేశారు. దీనిని నెటిజ‌న్లు భారీ ఎత్తున స్వాగ‌తిస్తూ పోస్టు చేస్తుండ‌డం విశేషం.

ప్ర‌ధాని గారు.. బాలుకు భార‌త‌ర‌త్న ఇవ్వండి
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts