నాన్న మరణించలేదు.. బాలు త‌న‌యుడు ఎస్పీ చరణ్ భావోద్వేగం!

September 25, 2020 at 2:54 pm

సుప్రసిద్ధ సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క‌న్నుమూసిన సంగ‌తి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. నెలరోజులకు పైగా కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన ఇక సెలవంటూ శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఈ లోకాన్ని విడిచారు.

బాలు ఇక లేరన్న వార్తతో భారతీయ చిత్ర పరిశ్రమ నివ్వెరపోయింది. అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక తన తండ్రి ఆరోగ్యానికి సంబంధించి ఎప్పటికప్పుడు అభిమానుల‌కు అప్‌డేట్స్‌ అందించిన ఎస్పీ చరణ్.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

మ‌ధ్యాహ్నం 1.04 గంటలకు ఎస్పీబీ కన్నుమూశారని చరణ్ వెల్లడించారు. తన తండ్రి కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ తన కుటుంబం తరపున కృతజ్ఞతలు చెపుతున్నానని అన్నారు. నాన్న గారు లేకపోయినా ఆయన పాట ఎప్పుడూ మీతోనే ఉంటుంది.. ఆ పాటే పలకరిస్తుంది. ఆయన మరణించలేదు మీతో మాతో ఆయను ఎప్పుడూ ఉంటారు అంటూ కన్నీటిపర్యంతమయ్యారు చ‌ర‌ణ్‌.

నాన్న మరణించలేదు.. బాలు త‌న‌యుడు ఎస్పీ చరణ్ భావోద్వేగం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts