ఆ ఏపీ మంత్రికి సిగ్గు ఉందా అంటూ ఫైర్ అయిన స్వామీజీ…

September 16, 2020 at 12:31 pm

ఏపీలో వరుసగా దేవాలయాల్లో జరుగుతున్న ఘటనలపై ఏపీ సాధుపరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంద్రకీలాద్రి కనకదర్గా అమ్మవారి రథం వెండి విగ్రహాలు మాయమయ్యాయని, దీనిపై కూడా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏమి అయ్యాయని ప్రశ్నించారు.

అలాగే శ్రీ కాళహస్తి క్షేత్రంలో నంది విగ్రహాన్ని ఎవరు ప్రతిష్టించారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్న సీఎం, దేవాదాయ శాఖ మంత్రి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఇన్ని ఘటనలు జరుగుతున్న దేవాదాయ శాఖ మంత్రికి సిగ్గు లేదా అని మండిపడ్డారు. వెంటనే రాజీనామా చేయాలని, ఈ ప్రభుత్వం మైనార్టీల కోసమే ఉందా? జగన్ సర్కార్‌లో హిందువులు లేరా? ఉంటే..ఎందుకు మాట్లాడరని ఫైర్ అయ్యారు.

ఇదిలా ఉంటే విజయవాడ నిడమానూరులో సాయిబాబా విగ్రాహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. బాబా విగ్రహం నుంచి తల, కాలు వేరు చేశారు. ఈ ఘటనపై సాయి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

ఆ ఏపీ మంత్రికి సిగ్గు ఉందా అంటూ ఫైర్ అయిన స్వామీజీ…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts