కొడాలి నానికి స్వామీజీ సవాల్…

September 24, 2020 at 2:43 pm

ఏపీలో కొడాలి నానిపై హిందూ సంఘాలు ఫైర్ అవుతూనే ఉన్నారు. టీటీడీ డిక్లరేషన్, హిందూ ఆలయాలపై కామెంట్ చేసిన కొడాలిపై టీడీపీ, బీజేపీ, పలు హిందూ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. తాజాగా సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కొడాలికి సవాల్ విసిరారు. కొడాలి నాని రాజీనామా చేసి మళ్లీ పోటీ చేస్తే హిందువుల శక్తి ఏంటో చూపిస్తామని సవాల్ విసిరారు.

కొడాలి నాని అచ్చోసిన ఆంబోతని, ఆయన మంత్రినా..రౌడీనా? అని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులతో కలిసి జెరూసలెం వెళ్లే జగన్‌ తిరుమలకు తీసుకురావడానికి అభ్యంతరం ఏంటి? అని అడిగారు. జగన్‌ను హిందూగా మార్చానని కనీసం శారదాపీఠం అయినా చెప్పాల్సి ఉందని, హిందూ మతానికి అన్యాయం జరుగుతుంటే శారదాపీఠం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు. జగన్‌ డిక్లరేషన్‌ ఇవ్వకుండా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని, జగన్ హిందువులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

కొడాలి నానికి స్వామీజీ సవాల్…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts