శ్రీ‌కాళ‌హ‌స్తిలో మ‌రో ఘ‌ట‌న‌….రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌కలం!

September 12, 2020 at 12:41 pm

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ఆల‌యాల్లో ఏం జ‌రుగుతున్న‌దో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొన్న‌ది. దేవాలయాల్లో వ‌రుసగా చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌లు భ‌క్తుల‌ను ఆందోళ‌న‌కు రేకేత్తిస్తున్నాయి. ఇటీవ‌లే అంత‌ర్వేది ఆల‌యంలోని ర‌థం ద‌గ్ధం కావ‌డంతో రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌కలం రేపింది. దీనిపై ప్ర‌భుత్వం ఇప్ప‌టికే సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన సంగ‌తి తెలిసిందే. ఆ వివాదం అటు కొన‌సాగుతుండ‌గానే మ‌రో సంఘ‌ట‌న శ్రీ‌కాళ‌హ‌స్తిలో చోటుచేసుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వివ‌రాల్లోకి వెళ్లితే..

ఆల‌యాల్లో ఏ చిన్న ప‌నిచేసినా సాధార‌ణ ఆగ‌మ‌నశాస్త్ర నియ‌మాల ప్ర‌కారం పూజ‌ల‌ను చేసిన త‌రువాత ప్రారంభించారు. అయితే శ్రీ‌కాళ‌హ‌స్తి ఆల‌యంలోని గ‌ర్బ‌గుడి స‌మీపంలో ఎవ‌రికీ తెలియ‌కుండా కొత్త నంది, శివ‌లింగం ఏర్పాటు కావ‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై భ‌క్తులు మండిప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా ఆల‌య అధికారుల స‌హాకారం లేకుండా బ‌య‌టివ్య‌క్తులెవ‌రూ విగ్ర‌హాల‌ను ఏర్పాటు చేయ‌లేర‌ని వారు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. బ‌య‌ట పూజ‌ల చేసి తీసుకొచ్చి ఆల‌యంలో నెల‌కొల్పార‌ని వారు వాదిస్తున్నారు. వెంట‌నే విగ్ర‌హాల‌ను తొల‌గించి సంప్రోక్ష‌ణ చేయాల‌ని భ‌క్తులు డిమాండ్ చేస్తున్నారు. అయితే వ‌రుస‌గా ఆల‌యాల్లో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటుచేసుకోవ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

శ్రీ‌కాళ‌హ‌స్తిలో మ‌రో ఘ‌ట‌న‌….రాష్ట్ర‌వ్యాప్తంగా క‌ల‌కలం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts