అందుకే విరాట్ కోహ్లీ నే తోపు : స్టీవ్ స్మిత్

September 11, 2020 at 3:57 pm

ప్రపంచంలోని ప్రస్తుత వన్డే బ్యాట్స్​మెన్​లలో తన దృష్టిలో విరాట్​ కోహ్లీ అత్యుత్తమమని ఆస్ట్రేలియా క్రికెటర్​ స్టీవ్​ స్మిత్​ చెప్పాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్​ ఏబీ డివిలియర్స్​ విలక్షణ ఆటగాడని తెలిపాడు. ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న​ స్మిత్​.. ఇన్​స్టా లైవ్​​లో నెటిజన్లు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు సమాధానమిస్తూ ఇలా చెప్పాడు.ప్రస్తుతం ఇంగ్లాండ్​ పర్యటనలో ఉంది ఆస్ట్రేలియా. ఇటీవలే మూడు మ్యాచ్​ల టీ20 సిరీస్​ను ఇంగ్లాండ్​ కైవసం చేసుకుంది. శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్​ ప్రారంభం కానుంది.

ఇది​ పూర్తయ్యాక ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ ఆటగాళ్లు ఐపీఎల్​ ఆడేందుకు యూఏఈ చేరుకుంటారు. ఈ నెల 19 నుంచి ఆరంభం కానుంది టోర్నీ. చెన్నై సూపర్​కింగ్స్​, ముంబయి ఇండియన్స్​ మధ్య తొలి మ్యాచ్​ జరగనుంది.ఐపీఎల్​ 13వ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభంకానుంది. టోర్నీ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మెగాలీగ్​ కోసం యూఏఈ చేరుకున్న తమ అభిమాన ఆటగాళ్లు ఏమి చేస్తున్నారు? అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. అందుకే జట్ల యాజమాన్యాలు ఎప్పటికప్పడు సామాజిక మాధ్యమాల ద్వారా ఆయా విశేషాలను పోస్ట్​ చేస్తూనే ఉన్నాయి.

అందుకే విరాట్ కోహ్లీ నే తోపు : స్టీవ్ స్మిత్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts