కంగ‌నాకు సన్నీ లియోన్ స్ట్రోంగ్ కౌంట‌ర్‌?

September 19, 2020 at 10:32 am

బాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్ కంగ‌నా ర‌నౌత్.. సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ మృతి త‌ర్వాత బాలీవుడ్ సినీ తారలు వ్యతిరేకించడం, వారిపై నోరు పారేసుకోవడం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్రముఖ నటి ఊర్మిళా మతోండ్కర్‌పై కంగ‌నా చేసి కామెంట్స్ ఒక్కసారిగా కలకలం పుట్టించాయి. ఊర్మిళ ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ అని పేర్కొంటూ ఆమెకు అర్ధనగ్నంగా డ్యాన్సులు చేయడం మాత్రమే తెలుసు తప్ప అస్సలు నటనే రాదని కంగ‌నా వ్యాఖ్యానించింది.

దీంతో కంగనా తీరుపై పలువురు బాలీవుడ్ స్టార్స్ విరుచుకుప‌డుతున్నారు. అయితే తొలుత ఊర్మిళను ఓ సాఫ్ట్ పోర్న్ స్టార్ గా అభివర్ణించిన కంగన, ఆపై, తానేమీ తప్పుగా విమర్శించలేదని, భారత సినీ పరిశ్రమ సన్నీ లియాన్ వంటి అడల్ట్ స్టార్ ను కూడా స్వాగతించిందని వ్యాఖ్యానించింది. ఈ కామెంట్ చూసిన సన్నీ లియోన్ తన సోషల్ మీడియాలో నర్మగర్భంగా అనీ అనకుండానే అనేసినట్టుగా కంగ‌నాకు ప్ట్రోంగ్ కౌంట‌ర్ ఇచ్చింది.

తాజాగా స‌న్నీ లియోన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో `నీ గురించి ఎంతో తక్కువ తెలిసిన వాళ్లు, ఎంతో ఎక్కువ మాట్లాడటం చాలా ఫన్నీగా ఉంది`అని కామెంట్ చేసింది. దీంతో స‌న్నీ లియోన్ పోస్ట్ వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టికే ఈ 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. మ‌రియు సన్నీ సరిగ్గా మాట్లాడిందని కామెంట్లు పెడుతున్నారు నెటిజ‌న్లు.

కంగ‌నాకు సన్నీ లియోన్ స్ట్రోంగ్ కౌంట‌ర్‌?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts