సుశాంత్ కేసులో అసలు రహస్యం చెబుతా అంటున్న బిజెపి ఎమ్మెల్యే..?

September 17, 2020 at 5:38 pm

బాలీవుడ్ నటుడు సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ఆత్మహత్య చేసుకున్న కొన్ని రోజుల్లోనే సుశాంత్ సింగ్ కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది. అయితే కేసుపై స్పందించిన బిజెపి ఎమ్మెల్యే నితీష్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ మాజీ మేనేజర్ దిశ ప్రియుడు రోహన్ ను అధికారులు విచారించాలని ఒకవేళ అతడు ముందుకు రాకపోతే తానే ఈ కేసుకు సంబంధించి కొన్ని రహస్యాలను సీబీఐకి చెబుతాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వరుసగా దిశ, సుశాంత్ ఆత్మహత్య తర్వాత అతడు భయంతో ఎవరికీ కనిపించకుండా దూరంగా ఉంటున్నాడని తెలిపిన బిజెపి ఎమ్మెల్యే… కేసులో అతనికి కీలక విషయాలు తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ అతను భయపడి బయటికి రాకపోతే రహస్యాలన్నీ తానే సీబీఐకి చెప్పేస్తాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు లేఖ రాశారు బిజెపి ఎమ్మెల్యే ముఖేష్ రాణే . పలు కీలక విషయాలు మీ దృష్టికి తీసుకు రావాలనే ఉద్దేశ్యంతో ఈ లేఖ రాస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు.

సుశాంత్ కేసులో అసలు రహస్యం చెబుతా అంటున్న బిజెపి ఎమ్మెల్యే..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts