జగన్, కొడాలిలకు స్ట్రాంగ్ వార్నింగ్…!

September 23, 2020 at 12:43 pm

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, మంత్రి కొడాలి నానిలపై స్వామి పరిపూర్ణానంద సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి ఎవడబ్బ సొత్తు అనడం చాలా దారుణమైన అంశమని, తిరుమల డిక్లరేషన్ పై ప్రశ్నించడం అహంకారమే అవుతుందని అన్నారు. దేవుళ్ల గురించి మాట్లాడే స్థాయి నానికి లేదని, తిరుమల కొండతో పెట్టుకున్న వారి బూడిద కూడ దొరకలేదని, ఆ చరిత్ర కూడా కళ్లముందే ఉందని, దేవుళ్లతో పెట్టుకుంటే నామరూపాలు లేకుండా పోతారని హెచ్చరించారు.

ఇక మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు సీఎం జగన్‌కు వినిపిస్తున్నాయో? లేదో? తెలియనది, సీఎం స్పందించకపోతే సీఎం జగనే మాట్లాడించారని అనుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. తిరుమల దర్శనార్థం వెళ్లే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా ‘డిక్లరేషన్’ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు. జగన్ ప్రభుత్వానికి 150 సీట్లు వచ్చాయని, అందులో 149 స్థానాలు హిందువులు ఓట్లు వేస్తేనే వచ్చాయని చెప్పారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కొడాలి నాని హిందువు కాలేడని, ఆయనలా తాను బజారు మాటలు మాట్లాడనని స్వామీజీ అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్‌ను ఓడించడానికి కొందరు కుట్ర పన్నుతున్నారని, మంత్రి నాని లాంటి వాళ్లు ఈ కుట్రలో భాగస్వామ్యం అయ్యారని ఆరోపించారు.

 

జగన్, కొడాలిలకు స్ట్రాంగ్ వార్నింగ్…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts