ఇంటినే షూటింగ్ స్పాట్‌గా మార్చేసిన త‌మ‌న్నా!

September 19, 2020 at 7:55 am

ప్ర‌స్తుతం కంటికి క‌నిపించ‌ని క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాణాంత‌క వైర‌స్ ధాటికి అన్న రంగాలు తీవ్ర ఇబ్బందులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా సినీ రంగంపై క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. అయితే ఇప్పుడిప్పుడు కేంద్రం అనుమ‌తుల‌తో షూటింగ్‌లు మ‌ళ్లీ ప్రారంభం అవుతున్నాయి.

అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా తన ఇంటినే షూటింగ్ స్పాట్‌గా మార్చేసింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమె తెలిపింది. `షూటింగ్‌ని, సెట్స్‌ని చాలా మిస్‌ అవుతున్నా. ఓ షూట్‌ కోసం ముంబైలోని మా ఇల్లే సెట్‌లా మారింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ టీమ్‌ అంతా పనిచేశాం. కెమెరా ముందుకెళ్లగానే ఎంతో ఉత్సాహం వచ్చింది` అని తమన్నా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పేర్కొంది.

అయితే దేనికి సంబంధించిన షూటింగ్‌ అనేది ఆమె చెప్పలేదు. ఇక షూటింగ్‌ అనంతరం తమన్నా ఇంట్లో వంట‌లు కూడా త‌యారు చేశారు. కాగా, తెలుగులో ఆమె నటించిన ‘దటీజ్‌ మహాలక్ష్మి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, బాలీవుడ్‌లో నటించిన ‘బోలే చుడియా’ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. అలాగే తెలుగులో గోపీచంద్‌తో కలిసి ‘సీటీమార్‌’ చిత్రంలో త‌మ‌న్నా నటిస్తున్నారు.

ఇంటినే షూటింగ్ స్పాట్‌గా మార్చేసిన త‌మ‌న్నా!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts