హాస్పటల్‌లో చేరిన డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్.. షాక్‌లో ఫ్యాన్స్‌!

September 24, 2020 at 10:29 am

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌ను ముప్ప‌తిప్ప‌లు పెడుతున్న సంగ‌తి తెలిసిందే. కంటికి క‌నిపించ‌కుండా చాప కింద నీరులా విస్త‌రిస్తున్న ఈ క‌రోనాను అంతం చేసే వ్యాక్సిన్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులోకి రాలేదు. దీంతో అడ్డు అదుపు లేకుండా క‌రోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇక సామాన్యుల‌తో పాటు సెల‌బ్రెటీలు, రాజ‌కీయ నాయ‌కులు ఇలా అంద‌రిపై క‌రోనా దాడి చేస్తోంది.

తాజాగా ప్రముఖ తమిళ సినీ నటుడు, ఎన్నో సూప‌ర్ హిట్‌ చిత్రాల్లో నటించి, తన అభిమానులను మెప్పించి, ఆపై రాజకీయాల్లోకి వచ్చి, డీఎండీకే పేరిట పార్టీని పెట్టిన విజయ కాంత్‌ కు కరోనా సోకింది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యం బాధపడుతున్న విజయ్ కాంత్ కు.. క‌రోనా ప‌రీక్ష‌లు చేయ‌గా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది.

దీంతో వెంట‌నే ఆయ‌న‌ను హుటాహుటీన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారని తెలుస్తోంది. విజ‌య్ కాంత్‌కు క‌రోనా సోక‌డంతో.. ఆయన అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. విజయ్ కాంత్ ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనగా, ఆ సమయంలోనే వైరస్ ఎవరి నుంచో అంటుకున్నట్టు తెలుస్తోంది. కాగా, విజయ్ కాంత్ కరోనా సమయంలోనూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేసారు. కరోనాతో చనిపోయిన వారి ఖననం కోసం భూదానం చేశారు.

హాస్పటల్‌లో చేరిన డిఎండికె అధ్యక్షుడు విజయ్ కాంత్.. షాక్‌లో ఫ్యాన్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts