బ‌న్నీ `పుష్ప‌`లో తమిళ స్టార్ హీరో?

September 27, 2020 at 8:54 am

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ముత్తం శెట్టి క్రియేషన్స్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ స‌ర‌స‌న ర‌ష్మిక మంద‌న్నా న‌టిస్తోంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పుష్ప తెరకెక్కనుంది. ఇందులో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నారు.

ఇదిలా ఉంటే.. ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ చిత్రంలో తమిళ స్టార్‌ హీరో మాధవన్ న‌టించ‌నున్నాడ‌ట‌. విజయ్ సేతుపతి చేయాల్సిన రోల్ లో మాధవన్ చేయనున్న‌ట్టు టాక్ న‌డుస్తోంది. మ‌రి ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

R Madhavan: Kangana in my opinion is extremely educated | Hindi Movie News  - Times of India

కాగా, ఈ సినిమా షూటింగ్ నవంబర్ 20 నుండి స్టార్ట్ చేయాల‌ని చిత్ర యూనిట్ స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే త్వరలో పుష్ప యూనిట్ కేళ అడవుల్లోకి వెళ్లేందుకు రెడీ అవుతోందట. క‌రోనా వేగంగా విజృంభిస్తున్న కార‌ణంగా.. సాధ్యమైనంత తక్కువమంది స‌భ్యుల‌తో మాత్రమే షూటింగ్ స్టార్ట్ చేస్తారట. ఇక దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది.

బ‌న్నీ `పుష్ప‌`లో తమిళ స్టార్ హీరో?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts