త్వరలో ధోని కొత్త అవతారం..?

September 30, 2020 at 6:03 pm

ఇటీవలే భారత మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ తన అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులందరికీ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక ధోని రిటైర్మెంట్ పై ఎన్నో రోజుల పాటు ఆసక్తికర చర్చ కూడా జరిగింది. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా ధోని జట్టును ముందుకు నడిపించే పనిలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే త్వరలో ధోనీ తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా క్రికెట్ కు ఎలాంటి సంబంధం లేదని ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టబోతున్నారు ధోని . ఇప్పటికే ధోనీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై… రోర్ ఆఫ్ ది లయన్ అనే వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో పూర్తిస్థాయిలో ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగుపెట్టి సొంత బ్యానర్ ద్వారా కొత్త టాలెంట్ ను ప్రోత్సహించి మరిన్ని వెబ్ సిరీస్ లు నిర్మించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తమ బ్యానర్ తరఫున కొత్త ప్రతిభకు ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని ధోనీ సతీమణి సాక్షి తెలిపారు.

త్వరలో ధోని కొత్త అవతారం..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts