జగనన్న టోకరా: టీడీపీ గుర్తు చేయాల్సివస్తుంది…

September 15, 2020 at 3:26 pm

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ మహిళా నేత అనిత తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. డ్వాక్రా మహిళలంతా ప్రభుత్వం ఇస్తున్న ఆసరా సొమ్ముతోనే బతుకుతున్నట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, 5 లక్షల వరకు తీసుకునే రుణం మొత్తానికి వడ్డీలేకుండా చంద్రబాబు ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు చేయూత నిచ్చిందని గుర్తు చేశారు. ‘వైఎస్సార్ ఆసరా పేరుని జగనన్న టోకరాగా మార్చుకోవాలని, జగన్ ఇచ్చిన హామీలను ఆయనకు పదేపదే టీడీపీ గుర్తుచేయాల్సి రావడం బాధాకరమని చెప్పారు.

అలాగే ఏడున్నర లక్షల రుణం తీసుకున్న వారికి ప్రభుత్వం 16 నెలలు వడ్డీకింద దాదాపు లక్షా92వేలు చెల్లించాలని, ఆ సొమ్ము మొత్తం జగన్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఎగ్గొట్టిందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇస్తున్న సొమ్ముని కూడా సక్రమంగా ఇవ్వకుండా అక్కాచెల్లెళ్లను జగన్ దారుణంగా మోసగిస్తున్నారని, ఇది వరకే తీసుకున్న అప్పులు చెల్లించిన వారికి ప్రభుత్వం ఇస్తున్న ఆసరా సొమ్ము జమకాదని,  రూ.లక్షా 50 వేలను నాలుగు విడతల్లో ప్రభుత్వం చెల్లిస్తే.. ఆ సొమ్ము వారు చెల్లిస్తున్న వడ్డీకే సరిపోదని వ్యాఖ్యానించారు.

అలాగే అధికారంలోకి వచ్చాక గ్రూప్ మొత్తానికి ఇచ్చే సొమ్మును రూ.3 లక్షలకే పరిమితం చేశారని, రూ.3 లక్షల లోపు తీసుకునే వారికే ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందంటూ కొత్త మెలిక పెట్టారని,  రూ.3లక్షలలోపు రుణం తీసుకునే డ్వాక్రా గ్రూపులు కేవలం పది శాతం మాత్రమే ఉంటాయని, ఈ పథకం వారికే ఉపయోగపడుతుందని అన్నారు.

జగనన్న టోకరా: టీడీపీ గుర్తు చేయాల్సివస్తుంది…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts