ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో కీలక మలుపు: మంత్రి కుమారుడుకు లంచం…

September 18, 2020 at 2:37 pm

గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ‌ఎస్‌ఐ స్కామ్ జరిగిందని చెప్పి ప్రస్తుత జగన్ ప్రభుత్వం కొందరు అధికారులు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అచ్చెన్నని జైలులో కూడా పెట్టగా, ఇటీవలే బెయిల్ మీద బయటకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ‌ఎస్‌ఐ స్కామ్ గురించి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సంచలన ఆరోపణలు చేశారు. కార్మికశాఖ మంత్రి జయరాంకు ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో ఏ14గా ఉన్న వ్యక్తి బినామీ అని, అందుకే ఆయన కుమారుడికి బెంజి కారు గిఫ్ట్‌గా ఇచ్చాడని విమర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్‌కు బెంజి కారు ఇస్తున్న ఫొటోను మీడియాకు విడుదల చేశారు. ముద్దాయికి, మంత్రి కుమారుడికి సంబంధమేంటో తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు.

ఈ విషయమై ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, జయరాంను మంత్రి మండలి నుంచి తప్పించాలని, ఇలాంటి పరిస్థితిలో జయరాంను మంత్రిగా కొనసాగించడం న్యాయం కాదని, దీనిపై ప్రభుత్వం ఏ కమిటీ వేసినా ఆధారాలు చూపడానికి సిద్ధంగా ఉన్నానని, ఎలాంటి ఆధారాలూ లేకుండా అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని, ఆధారాలు లేకుండా బీసీ నాయకుల జోలికొస్తే సమాధి అవుతారని అయ్యన్నపాత్రుడు అన్నారు.

ఈ‌ఎస్‌ఐ స్కామ్‌లో కీలక మలుపు: మంత్రి కుమారుడుకు లంచం…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts