ఆ భయంతోనే జగన్ సిట్ తెరపైకి తీసుకొచ్చారు…

September 16, 2020 at 1:49 pm

అవినీతిపరులు కేసులు త్వరగా తేల్చాలని బీజేపీ నేత సుప్రీంలో వేసిన పిటిషన్‌తో తనకు ముంపు ముంచుకొస్తుందని జగన్‌కు అర్థమైందని టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి విమర్శించారు. అందుకే తనపై ఉన్న కేసుల విచారణ ప్రారంభమై, ప్రజలు తనను ఛీకొడతారని భావించే గత టీడీపీ ప్రభుత్వంపై సిట్ విచారణ అని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. అందుకే సిట్ విచారణకు కూడా హైకోర్టు బ్రేక్ వేసిందని అన్నారు.

తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ చేసిన అవినీతిని ఎర్రన్నాయుడు బయటపెట్టాడనే అచ్చెన్నాయుడిపై కక్ష కట్టాడని, గతంలో తనకు శిక్షపడేలా వాదించాడనే నేడు దమ్మాలపాటి శ్రీనివాస్‌పై బురదజల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు.

అలాగే గతంలో సొంత బాబాయి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మొదట కోర్టులో పిటిషన్ వేసి, మళ్ళీ అధికారంలోకి రాగానే భయపడి దాన్ని ఉపసంహరించుకున్నారని, అప్పుడు సి‌బి‌ఐ వేయడానికి వెనుకాడిన జగన్, నేడు ప్రతిదానికీ  సీబీఐ విచారణ అనడం సిగ్గుచేటన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వ్యక్తి కేసుల భయంతో నేడు మోదీకి దాసోహమయ్యారని, 22 మంది ఎంపీలు, ఆరుగురు రాజ్యసభ్యులను చేతిలో ఉంచుకొని, ఒక్కరోజు కూడా కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం జగన్ చేయలేకపోయారని దుయ్యబట్టారు.

ఆ భయంతోనే జగన్ సిట్ తెరపైకి తీసుకొచ్చారు…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts