అందుకే జగన్‌తో చీవాట్లు తిన్నారు..తిరుపతి కొండపై బార్లు?

September 21, 2020 at 11:42 am

ఏపీలో తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి డిక్లరేషన్‌ విషయంపై రగడ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దీనిపై టీడీపీ నేత చెంగల్రాయుడు తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్‌లో సంతకం పెట్టమని అక్కడున్న అధికారి చెప్పి, జగన్‌తో చీవాట్లు తిన్నాడని గుర్తుచేశారు.

డిక్లరేషన్‌లో సంతకం పెట్టాలని ఎవరు చెప్పారని… అలా పెట్టకపోతే వెంకటేశ్వరస్వామి ఏం చేస్తాడని.. రథాలు తగలబడితే ఎవరికి ఏమైంది అని కొడాలి నాని మాట్లాడటం ప్రభుత్వ పథకంలో భాగమే అని విమర్శించారు. టీటీడీ నిబంధనలను బ్రిటీషు వారు కూడా గౌరవించారని, క్రిస్టియన్ అయినంతమాత్రాన జగన్ హిందూ దేవాలయాల్లో ఇష్టానుసారం ప్రవర్తిస్తాడా అని మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరి చూడబోతే తిరుమల కొండపై కూడా బార్లు  పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రపతి హోదాలో అబ్దుల్ కలామ్ వేంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చినప్పుడు అడిగిమరీ డిక్లరేషన్‌లో సంతకం పెట్టారని, సోనియాగాంధీ పుట్టుకతో క్రిస్టియన్ అయినా హిందూ వ్యక్తిని పెళ్లి చేసుకున్నాను కాబట్టి, ఆయన మతమే తన మతమని చెప్పిందన్నారు.

స్వామివారికి పట్టువస్త్రాలు దంపతులు మాత్రమే సమర్పించాలనే నిబంధన కూడా అనాదిగా వస్తున్నదే అని వెల్లడించారు. రాజు ఒక్కడు తప్పు చేస్తే ప్రజలు అంతకు మించి తప్పులు చేస్తారని తెలిపారు.

అందుకే జగన్‌తో చీవాట్లు తిన్నారు..తిరుపతి కొండపై బార్లు?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts