టీడీపీకి బిగ్ షాక్.. మ‌రో కీల‌క నేత రాజీనామా?

September 27, 2020 at 11:14 am

2019 ఎన్నికల్లో ఓటమి తరువాత టీడీపీకి పార్టీకి వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. ఎన్నిక‌ల్లో ఘోర ఓట‌మి అనంత‌రం నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో కీలక నేతలుగా గుర్తింపు పొందిన సీనియ‌ర్ నేతలు బాబును కాదని జగన్ చెంతకు చేరుతున్నారు. ఇక తాజాగా టీడీపీకి మ‌రో బిగ్ షాక్ త‌గిలింది.

పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన చేశారు. పార్టీలో పరిస్థితులు బాగోలేవు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కనుమరుగైంది. అందుకే రాజీనామా చేస్తున్నా అని గ‌ద్దె తెలిపారు.

కాగా, విజయనగరం జిల్లాలో కీలకనేతగా ఉన్న బాబురావు 1994-1999 ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తరువాత ఆ పార్టీలో చేరిన గ‌ద్దే.. అక్క‌డ ప్రాధాన్యం లేక‌పోవ‌డంతో మ‌ళ్లీ టీడీపీలో చేరారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో చీపురుపల్లి అసెంబ్లీ టిక్కెట్ ఆశించించి భంగ‌ప‌డ్డారు. దీంతో అప్ప‌టి నుంచి ఆయ‌న టీడీపీకి దూరంగా ఉంటూ వ‌స్తున్నారు.

టీడీపీకి బిగ్ షాక్.. మ‌రో కీల‌క నేత రాజీనామా?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts