టీడీపీ సీనియర్ నాయకురాలుకు తీవ్ర గాయాలు..

September 26, 2020 at 2:06 pm

ఏపీ టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారికి తీవ్ర గాయాలయ్యాయి. తెనాలిలోని ఆమె నివాసంలో కాలు జారి కింద పడటంతో ఆమె తలకు గాయమైంది. కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో చెకప్ అనంతరం ఇంటికి చేరుకుని డాక్టర్ల పర్యవేక్షణలో నన్నపనేని చికిత్స పొందుతున్నారు. ఇక టీడీపీ నేతలు ఆమె ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారు.

కాగా, నన్నపనేని టీడీపీలో కీలకంగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడూ ఆమె మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆమె ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ పదవికి రాజీనామా చేశారు. వాస్తవానికి ప్రభుత్వం మారినా మహిళా కమిషన్ చైర్‌పర్సన్ పదవిలో కొనసాగాలని నన్నపనేని రాజకుమారి భావించారు. కానీ జగన్ ప్రభుత్వం ఆ అవకాశం కల్పించలేదు.

టీడీపీ సీనియర్ నాయకురాలుకు తీవ్ర గాయాలు..
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts