అసెంబ్లీలో తమ్మినేని మోసాలు… సోమేశ్వరరావు ఎవరు?  

September 16, 2020 at 1:36 pm

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ నేతలు తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇటీవలే టీడీపీ నేత కూన రవికుమార్, సోమేశ్వరరావు అనే వ్యక్తి తమ్మినేని పేరు చెప్పి, అసెంబ్లీలో ఉద్యోగాలు వేయిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని విమర్శలు గుప్పించారు. తాజాగా టీడీపీ నేత బాల వీరాంజనేయస్వామి కూడా మాట్లాడుతూ… సోమేశ్వరరావు విషయంలో స్పీకర్ తమ్మినేని వెంటనే క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమ వ్యాపారాలకు ఆదర్శంగా తమ్మినేని  నిలిచారని… స్పీకర్ పదవిని తప్పుడు పనులకు వాడుకుంటున్నారని మండిపడ్డారు.

అలాగే అసెంబ్లీ, సెక్రటేరియేట్‌లో ఉద్యోగాల పేరుతో మోసగిస్తూ ఆయన కుర్చీని అవమానించారని, ఆముదాలవలసలో అక్రమ ఇసుక, మట్టి తవ్వకాలు తీవ్రమయ్యాయన్నారు. నాగావళి, వంశధారను ఊడ్చేస్తున్నారని, సోమేశ్వరరావు అనే వ్యక్తి విషయంలో వచ్చే ఆరోపణలపై స్పీకర్ స్పందించాలని, ఏ హోదాలో అసెంబ్లీ, సెక్రటేరియేట్‌కు సోమేశ్వరరావు వస్తున్నారని ప్రశ్నించారు. తమ్మినేని సీతారాం వ్యవస్థలకు, సమాజానికి, శాసనసభ్యులకు ఆదర్శంగా ఉండాలని హితవు పలికారు.

అసెంబ్లీలో తమ్మినేని మోసాలు… సోమేశ్వరరావు ఎవరు?  
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts