పిచ్చి బ్రాండ్లతో తాళిబొట్లు తెగుతున్నాయి…

September 26, 2020 at 2:40 pm

ఏపీలో మద్యం బ్రాండ్లపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు కరోనా వ్యాప్తికి మద్యం కారణమవుతుందని అన్నారు.  మద్యాన్ని నిత్యావసర వస్తువుగా ప్రభుత్వం వ్యాపారం చేయడం వల్లే కరోనా వ్యాప్తి జరుగుతుందని విమర్శించారు. మద్యంపై జే టాక్స్ ద్వారా ప్రభుత్వం కంటే జగన్‌కే రెట్టింపు ఆదాయం వస్తుందని, అనామక కంపెనీల నాసిరకం మద్యంతో పేదల ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.

రాష్ట్రంలో పిచ్చి బ్రాండ్లు, అనామక మద్యంతో తాళిబొట్లు తెగుతున్నా జగన్‌కు లెక్క లేదన్నారు. సంవత్సరానికి 20 శాతం మద్యం దుకాణాలు తగ్గిస్తానన్న జగన్ ఎందుకు నేడు మాట తప్పారు? అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో మాల్స్‌ తరహా లిక్కర్‌ షాపులకు (వాక్‌ ఇన్‌ స్టోర్స్‌) ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రస్తుత మద్యం పాలసీని నవంబరు 1 నుంచి మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో తెలిపింది. ప్రస్తుతం ఉన్న 2,934 షాపులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది.

 

పిచ్చి బ్రాండ్లతో తాళిబొట్లు తెగుతున్నాయి…
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts