చంద్ర‌బాబుకు షాక్‌.. టీడీపీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్‌బై?

September 19, 2020 at 7:24 am

టీడీపీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ‌రుస షాకులు త‌గులుతున్నాయి. టీడీపీకి చెందిన ముఖ్య నేతలంతా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో కీలక నేతలుగా గుర్తింపు పొందిన నేతలు ఎన్నికల్లో పరాజయం తరువాత బాబును కాదని జగన్ చెంతకు చేరుతున్నారు. తాజాగా టీడీపీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్‌బై చెప్ప‌నున్నారు.

విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పార్టీని వీడ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలోనే నేడు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డితో భేటీ కానున్నారు. అయితే టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరి బాటలోనే గ‌ణేష్ కూడా న‌డ‌వ‌నున్నారు. అంటే గణేష్ వైఎస్సార్‌సీపీలో చేరకుండా ఆ పార్టీకి మద్దతుగా ఉండ‌నున్నార‌ని స‌మాచారం.

కాగా, 2009 ఎన్నికల్లో విశాఖ దక్షిణం నియోజకవర్గం నుంచి టీడీపీ త‌రుపున పోటీ చేసిన వాసుపల్లి గణేష్ ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక ఆ త‌ర్వాత 2014లో అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయ‌గా విజయం సాధించారు. 2019లో మళ్లీ అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు.

చంద్ర‌బాబుకు షాక్‌.. టీడీపీకి మ‌రో ఎమ్మెల్యే గుడ్‌బై?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts