తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై జగన్ ఆత్మ పరిశీలన..?

September 23, 2020 at 4:00 pm

ఏపీ సీఎం జగన్ కేంద్రం ఇస్తానన్న నాలుగువేల కోట్ల కు ఆశపడి ఏపీ రైతులందరికీ అన్యాయం చేస్తున్నారంటూ ఇటీవలే తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కాని తమ ప్రభుత్వం అలా చేయదు అంటూ వ్యాఖ్యానించారు హరీష్ రావు. ఈ వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా.. ఇదే వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీలు కూడా జగన్ సర్కార్ పై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన టిడిపి నేత యరపతినేని శ్రీనివాసరావు జగన్ పై విమర్శలు చేశారు.

హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. నాలుగు వేల కోట్లకు ఆశపడి జగన్ విద్యుత్ మీటర్ ల పేరుతో.. రాష్ట్ర రైతులందరికీ ఉరి బిగిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి… కేంద్రానికి వత్తాసు పలుకుతున్నారు అంటూ విమర్శించారు. వ్యవసాయ అభివృద్ధి విషయంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైందని అంటూ విమర్శించారు.

తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలపై జగన్ ఆత్మ పరిశీలన..?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts