పార్ల‌మెంట్‌లో బ్లూఫిల్మ్ చూస్తూ బుక్క‌యిన ఎంపీ

September 18, 2020 at 8:12 pm

నీలిచిత్రాలు చూస్తూ ఎంపీలు బుక్క‌యిన ఘ‌ట‌న గ‌తంలో భార‌త‌పార్ల‌మెంట్‌లో వెలుగుచూసిన సంగ‌తి తెలిసిందే. ఆ విష‌యం యావ‌త్ భార‌త్‌లో క‌ల‌క‌లం రేపింది. ఇప్పుడు తాజాగా అదే ఘ‌ట‌న థాయ్‌లాండ్ పార్లమెంట్ జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం. ఆ దేశ ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం చదువుతున్న స‌మ‌యంలో అధికార పార్టీ ఎంపీ రోన్నతెప్ అనువాత్ నీలి చిత్రాలు చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరుల‌కు ఆ దృశ్యాలు కంట‌బ‌డ్డాయి. ఏకంగా పది నిమిషాలపాటు ఆయ‌న‌ నీలి చిత్రాలను స్క్రోల్ చేసినట్లు వారు గుర్తించారు. ఇంకేముంది ఓ అంతర్జాతీయ మీడియా ఈ విష‌యాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది.

ఇదిలా ఉండ‌గా, నీలి చిత్రాలు చూస్తున్న ఎంపీ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీడియా గ్యాలరీలో ఉన్న విలేకరులు ఆ ఫొటోలను తీశారు. తాను నీలి చిత్రాలను చూసినట్లు స‌ద‌రు నేత విలేకరుల ముందు ఒప్పుకోవ‌డం గ‌మ‌నార్హం. అయితే పార్ల‌మెంటులో ఆ చిత్రాలను ఎందుకు చూడాల్సి వ‌చ్చిందని ప్ర‌శ్నించగా ఆయ‌న చెప్పిన స‌మాధానం విని ఆ విలేక‌రులు మ‌రింత కంగుతిన్నారు. ఆ చిత్రాల్లోని మహిళ సాయం చేయాల‌ని ప్రాదేయపడుతున్న‌ద‌ని.. అది నిజమో, అబద్ధమో తెలుసుకునేందుకే ఆ చిత్రాన్ని ప‌రీక్ష‌గా చూశానని తెల‌ప‌డం కొస‌మెరుపు. ఆమె చుట్టూ ఉన్న వాతావరణాన్ని గమనించ‌గా, కొంతమంది గ్యాంగ్‌స్టర్లు ఆమెను వేధింపులకు గురిచేస్తున్న ఉన్న‌ద‌ని, అందుకే ఆమె ఏమైనా ప్ర‌మాదంలో ఉందేమోన‌ని ఆ ఫొటోల‌ను ప‌రిశీలించాన‌ని అనువాత్ తెలప‌డం విశేషం. ఆ త‌ర్వాత ఆ ఫొటోలను డిలీట్ చేసిన‌ట్లు వెల్ల‌డించ‌డం కొస‌మెరుపు.

పార్ల‌మెంట్‌లో బ్లూఫిల్మ్ చూస్తూ బుక్క‌యిన ఎంపీ
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts