డ్రగ్స్ వాడినట్టు ఒప్పుకున్న ఆ హీరోయిన్

September 26, 2020 at 8:08 pm

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో శ్రద్ధా కపూర్‌‌ను ఎన్సీబీ అధికారులు విచారించారు. ఈ కేసులో ఇప్పటికే శ్రద్ధాతో పాటు దీపికా, సారా అలీ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు ప్రశ్నించారు. బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ మృతి కేసులో విచారణ జరుపుతోన్న అధికారులకు సినీ పరిశ్రమలో‌ని కొందరు సెలబ్రిటీలు డ్రగ్స్‌ వాడుతున్నట్లు తేలడంతో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌తో ఈమె చిచ్చరే సినిమా చేసింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఓ పార్టీ జరిగింది. ఆ పార్టీలో చాలా మంది డ్రగ్స్ తీసుకున్నారు. కానీ సుశాంత్ మాత్రం ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని శ్రద్ధా విచారణలో వెల్లడించింది.

ఆ పార్టీలో డ్రగ్స్ ఇచ్చినవాళ్లు ఎవరో తనకు తెలియదంటూ ఎన్సీబీ అధికారుకులకు శ్రద్ధా సమాధానమిచ్చింది. ఒకవేళ వాళ్లను చూస్తే మాత్రం వాళ్లను గుర్తు పడతానంది. ఈ విచారణలో శ్రద్దా కపూర్ తాను CBD అనే డ్రగ్స్ తీసుకున్నట్టు విచారణలో వెల్లడించింది. అంతేకాదు అపుడపుడు షూటింగ్ సమయంలో వ్యానిటీ వ్యాన్‌లో సుశాంత్ డ్రగ్స్ వాడినట్టు శ్రద్ధా వెల్లడించింది. విచారణలో భాగంగా హీరోయిన్‌ దీపికా పదుకొనే ఈ రోజు ఉదయం నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) అధికారుల ముందు విచారణకు హాజరైంది.

డ్రగ్స్ వాడినట్టు ఒప్పుకున్న ఆ హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts