తండ్రిని చంపి పొలంలో పాతిపెట్టిన ఘనుడు

September 27, 2020 at 7:04 pm

రోజురోజుకు మానవ సంబంధాలు మంటకలిసిపోతున్నాయి సమాజంలో మానవత్వం ఉన్న మనసులు కరువై కిరాతకులుగా మారుతున్న మనుషులు ఎక్కువైపోతున్నట్లు అనిపిస్తోంది. కన్న తండ్రికి అండగా నిలవాల్సిన కొడుకు తండ్రిని పొట్టనెబెట్టుకున్నాడు. నిండు నూరేళ్లు అండగా ఉంటానని ప్రమాణం చేసిన భార్య భర్త ప్రాణాలు తీసెయ్యమని మరీ కొడుకుని ప్రోత్సహించింది. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం గుండాలకి చెందిన కిష్టయ్య నెల రోజుల నుంచి కనిపించకుండా పోయాడు. అయితే బంధువులు గమనించి అతడి కోసం ఎన్ని గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. అయితే తండ్రి కనిపించడం లేదన్న ఆలోచన కొడుకులో ఏమాత్రం కనిపించలేదు. అంతేకాదు మంచి ఉత్సాహంగా ఉన్నారు. దాంతో అనుమానం వచ్చిన బంధువులు అతడిని నిలదీశారు. అయినా ఏమీ తెలియనట్లు బుకాయించాడు.

బంధువులు అంతా కలిసి మూకుమ్మడిగా నిలదీయడంతో తన తండ్రిని తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. తల్లితో కలిసి తండ్రిని హత్య చేసి పొలంలో ఎవరికీ అనుమానం రాకుండా పాతిపెట్టినట్లు అంగీకరించాడు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తల్లి కొడుకుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

తండ్రిని చంపి పొలంలో పాతిపెట్టిన ఘనుడు
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts