బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్

September 27, 2020 at 6:33 pm

ప్రస్తుతం టీవీలో ఆసక్తిగా చూసే షో అంటే అందరూ బిగ్ బాస్ అనే జవాబిస్తున్నారు… అంటే బిగ్ బాస్ షోకి ఎంతో ప్రజాదరణ ఉందన్న మాట. బిగ్ బాస్ అన్ని భాషల్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకొని నాలుగో సీజన్ లో అడుగుపెట్టింది. కాగా అప్పుడప్పుడు బిగ్ బాస్ పై విమర్శలు కూడా చేస్తుంటారు. ఫస్ట్ సీజన్ నుంచే ఈ షోకి ఎంతో పాపులారిటీ లభించింది. పాపులారిటీకి తగ్గట్టుగానే విమర్శల వర్షం కూడా కురిపిస్తున్నారు. అయితే బిగ్ బాస్ పై ఓ హిరోయిన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది.

తమిళ్ బిగ్ బాస్ లోక నాయకుడు కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ షో అక్టోబర్ 4 నుంచి ప్రసారం కానుంది. ఈ బిగ్ బాస్ షో లో కోలివుడ్ నటీ లక్షీ పాల్గొనడం లేదని ఆమె తేల్చిచెప్పారు. మరోకరు తిన్న ప్లేట్టు, టాయిలెట్లు బిగ్ బాస్ శుభ్రం చేస్తారన్నారు. అలాంటి పనులను చేయాలని తనకు లేదన్నారు. ఇలా స్పందించడంతో ఆమెను నెటిజన్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. ప్లేట్లు కడిగే వారు, టాయిలెట్లు శుభ్రం చేసే వారు తక్కువగా కనిపిస్తున్నారా అంటూ విమర్శల జల్లు కురిపించారు. ఏది ఏమైనా తాను మాత్రం తమిళ్ బిగ్ బాస్ లో పాల్గోనడం లేదని స్పష్టం చేశారు.

బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హీరోయిన్
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts