భార్యను గొడ్డలితో దాడి చేసి చంపిన భర్త

September 25, 2020 at 9:48 pm

విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నేటి సమాజంలో ప్రాణాలకు విలువ లేకుండా పోయింది. మద్యం మత్తులో కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. వివరాల్లోకి వెళితే కొమరాడ మండలం గుమడ గ్రామానికి చెంది ఊర్మిల భర్త కొంత కాలంగా మద్యానికి బానిసయ్యడు. రోజు తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవ పెట్టుకునేవాడు. ఇలానే భార్య భర్తల మధ్య తరుచు గొడవలు జరిగేవి. మద్యం మానేయమని ఊర్మిల ఎన్ని సార్లు మొరపెట్టుకున్న పెడచెవిన పెట్టుకుని ఊళ్లోకి వెళ్లి రోజు తాగి వస్తుండేవాడు.

భర్త మారడం లేదని భార్య పుట్టుంటికి వచ్చేసింది. దాంతో భార్యపై భర్త కక్ష పెట్టుకున్నాడు. భర్తకు మద్యం సేవించవద్దు అని చెప్పిన పాపానికి భర్యను గొడ్డలితో దాడి చేపసి పొట్టన పెట్టుకున్నారు. గాయపడిన ఊర్మిలను హుటాహుటిన కుటుంబసభ్యులు జిల్లాలోని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. తాగిన మైకంలో గొడవపడి గొడ్డలితో దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భార్యను గొడ్డలితో దాడి చేసి చంపిన భర్త
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts