కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అనే నిజాన్ని నిరూపించిన యువకుడు.. !!

September 23, 2020 at 7:14 pm

జీవితం అలా ఉండాలి.. ఇలా ఉండాలి.. పైకి ఎదిగాలి.. గొప్ప స్థాయిలో ఉండాలని సాధారణంగా ప్రతి వ్యక్తి కలలు కంటాడు. కానీ కొంతమంది మాత్రమే వాళ్ళు కన్నా కలలు నిజం చేసుకుంటారు. మరికొంత మంది కలలు కల్లలు గానే మిగిలిపోతాయి.. అయితే ఇప్పుడు చెప్పబోయే యువకుడు మాత్రం తాను అనుకున్నది సాధించి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు.. స్వయంగా పవర్ ప్యారా గ్లైడెర్ తయారుచేసి గాల్లో విన్యాసాలు చేసి అందరిని ఆకర్షించాడు.

వివరాలలోకి వెళితే పెద్దపల్లి జిల్లా రామగుండంలోని రైల్వే కాలనీకి చెందిన ఆడెపు అర్జున్ కు పారా గ్లైడెర్ రూపొందించాలని చిన్నపటి నుండి ఉన్న కల. ఈ యువకుడు బీకామ్ చదివాడు. అయితే అర్జున్ కు ఒక ఆలోచన వచ్చి స్వయంగా పారా గ్లైడెర్ తయారుచేయాలని అనుకున్నాడు. ఈ క్రమంలో అమెరికా, ఇటలీ నుంచి దాదాపు 15 లక్షల విలువ చేసే ఉపకరణాలు కూడా తెప్పించి పారా గ్లైడెర్ రుపొంచించాడు. జెన్ కో క్రీడా మైదానంలో ట్రయిల్ రన్ వేసాడు.. 20 నిమిషాల పాటు గాల్లోకి ఎగిరి విన్యాసాలు చేసాడు. ఈ సందర్బంగా అర్జున్ మాట్లాడుతూ తన కన్నా కల నెరవేరిందని, తన లాంటి వాళ్ళని గవర్నమెంట్ ప్రోత్సహించాలని కోరాడు.. !!!

కృషి ఉంటే మనిషి ఋషి అవుతాడు అనే నిజాన్ని నిరూపించిన యువకుడు.. !!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts