మీకు కరోనా ఉంటే ఈ కుక్కలు మిమ్మల్ని వదలవు సుమా…!

September 24, 2020 at 6:26 pm

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ పేరు వింటే చాలు వణికిపోతున్న విషయం తెలిసిందే. కరోనా కట్టడికి ప్రపంచ దేశాలు ఎన్నో నియంత్రణ చర్యలు చేపట్టినప్పటికీ ఈ మహమ్మారి మాత్రం తగ్గడం లేదు. దీంతో వైరస్ ను తగ్గించేందుకు అన్ని ప్రభుత్వాలు తీవ్ర కృషి చేస్తున్నాయి. ఈ వైరస్ ను కట్టడి చేయాలంటే ముందుగా కరోనా వచ్చిన వ్యక్తిని గుర్తించాలి. కానీ, ఇలా కరోనా వచ్చిన వ్యక్తిని గుర్తించడంలో ఆలస్యం అవుతుండడంతో ఈ వైరస్ ఇంకో నలుగురికి వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలో మహమ్మారి నివారణకు ప్రపంచ దేశాలు వివిధ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అయితే ఫిన్లాండ్ దేశం కొత్త రకమైన ఆలోచన అమలు చేస్తుంది. కరోనా రోగులను గుర్తించేందుకు ఫిన్లాండ్ ప్రభుత్వం ఏకంగా కుక్కలను రంగంలోకి దింపింది.

కుక్కలు ఏంటి కరోనా వ్యక్తిని అయినా సరే గుర్తు పట్టడం ఏంటి అనుకుంటున్నారా…? మీరు విన్నది నిజమే.. ఫిన్లాండ్ దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో కరోనా సోకిన ప్రయాణికులను గుర్తించడానికి ఈ కుక్కలను సిద్ధం చేశారు. కరోనా రోగులను గుర్తించేందుకు నార్డిక్లోని అంతర్జాతీయ విమానాశ్రయంలో నాలుగు నెలల పాటు ప్రయోగాత్మకంగా ఇవి శిక్షణ కూడా పొందాయి. ప్రస్తుతం నాలుగు కుక్కలు ఫిన్లాండ్ దేశంలోని హెల్సింకి విమానాశ్రయంలోకి వచ్చే కరోనా రోగులను గుర్తించే పనిలో పడ్డాయని అక్కడి అధికారులు ప్రకటించారు. ‘‘కుక్కలు వాసన పసిగట్టడంలో బాగా పనిచేస్తాయి. ప్రక్రియ ఖచ్చితమైన ఫలితాలనిస్తుంది” అని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకి చెందిన ఈక్వైన్ అండ్ స్మాల్ యానిమల్ మెడిసిన్ ప్రొఫెసర్ అన్నా హిల్మ్ జోర్క్మాన్ తెలిపారు. ఈ కుక్కల ఆలోచన విధానం కానుక విజయవంతం అయితే కరోనా వైరస్ ను త్వరగా కట్టడి చేయవచ్చు అన్న ఆలోచనలో ఉన్నారు.

మీకు కరోనా ఉంటే ఈ కుక్కలు మిమ్మల్ని వదలవు సుమా…!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts