విపక్షాల ఆందోళన మ‌ధ్యే రైతు బిల్లులకు రాజ్యసభ ఆమోదం!

September 20, 2020 at 3:04 pm

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు, వ్యవసాయ సంబంధ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగ‌తి తెలిసిందే. కార్పొరేట్లకు లాభం చేకూర్చేందుకే ఈ బిల్లులలను తెస్తున్నారని.. వీటి వ‌ల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతుందని.. కేంద్రంపై విపక్షాలు మండిపడుతున్నాయి. అయితే విపక్షాల నినాదాలు, కేకలు, నిరసనల మ‌ధ్యే ఆదివారం రాజ్యసభ‌లో ఈ బిల్లులను సభ ఆమోదిస్తున్నట్టు డిప్యూటీ చైర్మన్ హరివంశ్ ప్రకటించారు.

దీంతో ఇవి చట్టంగా మారనున్నాయి. ఇదివరకే లోక్ సభ సైతం ఈ బిల్లులను ఆమోదించింది. ఈ క్ర‌మంలోనే విపక్షాలు మాత్రం ఓటింగ్ కోసం పట్టుబట్టాయి. విపక్షాల డిమాండ్‌ను డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ తిరస్కరించారు. అయితే చివ‌ర‌కు మూజువాణీ ఓటుతో వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమెదించింది.

కాగా, వ్యవసాయ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం మూడు బిల్లులను సెప్టెంబర్ 14న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. ఈ వ్య‌వ‌సాయ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే మద్దతివ్వగా.. కాంగ్రెస్‌, తృణమూల్‌, టీఆర్‌ఎస్‌, డీఎంకే, శివసేన, ఆర్జేడీ, అకాలీదళ్‌, ఎస్పీ, ఆప్‌, బీఎస్పీలు వ్యతిరేకించాయి.

విపక్షాల ఆందోళన మ‌ధ్యే రైతు బిల్లులకు రాజ్యసభ ఆమోదం!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts