టిక్ టాక్ తో డీల్.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్.?

September 17, 2020 at 4:12 pm

భారత్-చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఘర్షణల దృశ్య… భారత భద్రతకు భంగం వాటిల్లే ప్రమాదం ఉంది అనే ఆరోపణతో చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను నిషేదించిన విషయం తెలిసిందే. అటు వెంటనే భారత మిత్ర దేశమైన అమెరికా కూడా ఇదే తరహా నిర్ణయం తీసుకొని టిక్ టాక్ బ్యాన్ చేసింది. కానీ చివరిగా టిక్ టాక్ కి ఒక అవకాశం కల్పిస్తూ డెడ్లైన్ కూడా విధించింది ట్రంప్ సర్కార్. తమ దేశంలోని స్థానిక సంస్థలకు అమెరికా టిక్ టాక్ యాజమాన్యపు హక్కులు విక్రయిస్తే.. ప్రభుత్వం టిక్ టాక్ యాప్ పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేస్తుంది అంటూ తెలిపారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.

ఈ మేరకు పలు సంస్థలు టిక్ టాక్ యాజమాన్యాన్ని కొనుగోలు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముందుగా మైక్రోసాఫ్ట్ టిక్టాక్ యాజమాన్యంతో చర్చలు జరపగా అవి కాస్త విఫలమయ్యాయి. ఆ తర్వాత… ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ రంగంలోకి దిగి బైట్ డాన్స్ తో చర్చలు జరిపింది. ఇక వీరి మధ్య ఒక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. తాజాగా దీనిపై స్పందించిన డోనాల్డ్ ట్రంప్… ఒరాకిల్ బైట్ డాన్స్ మధ్య డీల్ కుదిరిన విషయం తన దృష్టికి వచ్చిందని… అయితే ఈ డిల్ లో అధిక మొత్తం యాజమాన్య హక్కులు బైట్ డాన్స్ చేతిలో ఉండటం తనకు నచ్చలేదని దీనిపై తాను పునరాలోచిస్తాను అంటూ డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు.

టిక్ టాక్ తో డీల్.. ట్రంప్ షాకింగ్ కామెంట్స్.?
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts